భారత క్రికెటర్ల పెళ్లిలు ఒక దాని తరువాత ఒకటి వరసగా జరుగుతున్నాయి. తాజాగా ముంబై అల్ రౌండర్ కృనాల్ పాండ్య పెళ్ళికి సిద్దమయ్యారు. కృనాల్ ప్రియురాలు పాంకురీ శర్మను వివాహం చేసుకోబోతున్నాడు కృనాల్ . ఈ మధ్యకాలంలోనే భారత క్రికెటర్ల పెళ్లిలు వరుసగా జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ, భువనేశ్వర్, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కృనాల్ కూడా చేరాడు. మంగళవారం నిర్వహించిన మెహందీ ఫంక్షన్లో కృనాల్ తమ్ముడు టీమిండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్య డాన్సుతో దుమ్ము దులిపాడు. అన్న పెళ్ళిలో అసలు ఏ మాత్రం తగ్గకుండా డాన్సుతో ఇరగదీశాడు హార్దిక్ పాండ్య. అన్న తో కలిసి పంజాబ్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారు. వీరికి తోడు మనీష్ పాండ్య కూడా తోడయ్యారు.

Comments

comments