శ్రీనివాసరెడ్డి ఒక ప్రముఖ హాస్యనటుడు. కధానాయకుడిగా రెండు సినిమాలో “గీతాంజలి”, “జయమ్ము నిశ్చయమ్మురా” లో విజయం అందుకున్నాడు. ఇప్పటికే కధానాయకుడిగా చేసిన రెండు సినిమాలో కూడా విజయం అయ్యాడు. ఇప్పుడు మరొక్కసారి కధానాయకుడిగా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకి ఒక ఆశక్తికరమైన టైటిల్ ను సిద్ధం చేశారు. ఈ సినిమాకి జంబలకిడిపంబ అని టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.

శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్షన్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ఈ సినిమాకి జె. బి మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి మంచి రోజు కావటంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ మొదలు పెట్టాము. మర్చి 10వ తారీకు వరుకు సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీనివాసరెడ్డి, సిద్ది ఇద్నాని, పోసాని కృష్ణముర‌ళి, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. కొన్ని కీలక పాత్రలను హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, వైజాగ్, అరకు, కేరళలో షూటింగ్ చేయనున్నామని అన్నారు. ఇది ఒక కామెడీ సినిమా అని, పోసానిది దీనిలో చాల కీలక పాత్రా అని, వెన్నల కిశోరె ఈ సినిమాలో మంచి హైలెట్ గా నిలుస్తాడని, ఈ చిత్రం ప్రతి ఒక్కరు చూసేలా మెప్పిస్తుందని అన్నారు.

సినిమా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఇదే సరైన టైటిల్. సినిమా టైటిల్ బట్టే సినిమా ఏ రంగెలా ఉంటుందో చెప్పవచ్చు. శ్రీనివాస రెడ్డి కి తన పాత్రా బాగా నచ్చింది. శ్రీనివాస రెడ్డికి తన కెరీర్ సినిమాలో ఇది ఒక కీలక సినిమా అవుతుందని అన్నారు.

Comments

comments