తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం ఎస్సీ వర్గీకరణ పై కడియం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్కడ కడియం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదని అందులో భాగంగానే నవంబర్ 29, 2014వర్గీకరణను సమర్థిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు. ఆ తీర్మాన పత్రాలను ప్రధాని నరేంద్ర మోదికి కూడా పంపించామని అన్నారు. దండోరా ఉద్యమం ప్రారంభంలో వర్గీకరణపై కేంద్రం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. దానిలో కేసీఆర్ కూడా ఒక సభ్యుడే. ఒక్క వేల వర్గీకరణకు ప్రధాని దేశమంతటా సాధ్యం కాదని, అమలు చేయమని అంటే, కనీసం రాష్ట్రంలో అయినా సాధ్యం అయ్యేలా చెయ్యమని ప్రధాని నరేంద్ర మోదీ ని కోరాం అని అన్నారు. దీనిని గురించి అఖిలపక్ష బృదంతో మాట్లాడతామని చెప్పితే ప్రధాని అప్పాయింట్మెంట్ ఇచ్చారని కానీ చివర్లో కొన్ని కారణాల వలన రద్దు చేసుకోవాలిసి వచ్చిందని అన్నారు.

ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి నవంబర్ 6న చనిపోయారని ఆమె చనిపోవడం చాల భాదాకరమైన విషయం అని అన్నారు. అనంతరం వెంటనే సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకునివెళ్తామని అసెంబ్లీలో చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్ ప్రధాని లేక కూడా రాశారు. కానీ ప్రధాని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. జీఈఎస్, మెట్రో రైల్ ప్రారంబోత్సవానికి ప్రధాని మోడీ వచ్చినపుడు దాని గురించి మాట్లాడదాం అని కేసీఆర్ చెప్పారు. కాని సమయం తక్కువుగా ఉండడం కారణంగా దీనిపై మాట్లాడం ఇప్పుడు కుదరదు అని ప్రధాని స్పష్టం చేశారు. కాని కేసీఆర్ దాని తరువాత కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

Comments

comments