తనపై హత్యచారానికి ఒక్క కన్నడ హీరో పాల్పడ్డాడని ఓ యువతీ పోలీసులకు పిర్యాదు చేసింది. తనకు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి తనపై హోంబణ్ణ చిత్ర హీరో సుబ్రహ్మణ్య హత్యాచారం చేసినట్లు ఆ 23 సవంత్సరాల యువతీ బసవగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన కధనం ప్రకారం.. వారు ఇద్దరు కూడా రెండు సవంత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి పెళ్ళికి పెద్దలు కూడా అంగీకారం తెలిపారు.

చిత్ర షూటింగ్ తరువాత పెళ్లి చేసుకుందామని సుబ్రహ్మణ తనకి మాట ఇచ్చారు. దీనితో ఇరువురు కూడా ఆనందంగా ఉన్నారు. అయితే నవంబర్ 1వ తేదీన తన అక్క ఇంట్లో పార్టీ ఉన్నదని తను ఆ పార్టీ కి తప్పకుండా హాజరు కావాలని ఆ యువతిని సుబ్రహ్మణ ఇంటికి పిలిచాడు. తను కూడా నమ్మశక్యంగా ఇంటికి వెళ్ళిoది. కాని అక్కడ తనకి కూల్ డ్రింక్లో లో మత్తు మందు కలిపి ఆ యువతిపై హత్యాచారం చేశాడు.

అప్పుడు ఆ యువతీ తనని నిలిదీయగా త్వరలోనే పెళ్లి చేసుకుంటాం కదా అని నమ్మించాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీనితో ఆ యువతీ పోలీసులకు పిర్యాదు చేసింది. దానితో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ సుబ్రహ్మణ పరారీలో ఉన్నాడు. తన కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

Comments

comments