యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెస్టర్‌ కుక్‌ డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కుక్‌ ఆటపై సహచర ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ స్పందించాడు.”నువ్వే నా ఫేవరేట్‌ ప్లేయర” అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ప్రధానంగా కుక్‌ ఆటను కొనియాడిన స్టోక్స్‌.. అతనే తన ఫేవరేట్‌ ఆటగాడని మనసులో మాటను వెల్లడించాడు. 104 ఓవర్‌ నైట్‌ వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కుక్‌ మరో వంద పరుగులు సాధించి తన కెరీర్‌లో ఐదో ద్విశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది.

Comments

comments