ఛార్మి అనుకున్న‌ట్టే సిట్ అధికారుల‌కు బ్ల‌డ్ శాంపిల్ ఇవ్వ‌లేదు. కోర్టుకు వెళ్లి మ‌రీ త‌న హ‌క్కుల‌కోసం పోరాడిన ఛార్మి అనుకున్న‌ట్టుగానే సిట్ కు త‌న‌కు డ్ర‌గ్స్ తో సంబంధంలేద‌ని తెగేసి చెప్పింది.డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ చార్మి సిట్‌ ముందు హాజరయ్యారు.

నలుగురు మహిళలతో కూడిన అధికారుల బృందం ఆమెను విచారించింది. డ్రగ్స్ తీసుకుంటారా అని సిట్ అధికారులు చార్మిని ప్రశ్నించారు. సిట్ ప్రశ్నలకు చార్మి అచితూచి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్‌ తదితరుల వ్యవహార శైలి గురించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు.

తమకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చార్మి చెప్పినట్టు సమాచారం. గోవాలో పార్టీ గురించి సిట్ అధికారులు ఆరా తీశారు. కెల్విన్‌తో పరిచయాలపైనా ప్రశ్నించారు. అయితే కెన్విన్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చార్మి వివరించారు. హైకోర్టు ఆదేశాలు ఉండడంతో చార్మి తన రక్త నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించారు.

అయితే చార్మి సిట్ విచారణకు వస్తున్న సమయంలో కొందరు కానిస్టేబుళ్లు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ఒక కానిస్టేబుల్ ఏకంగా చార్మిపై చేయి వేశారు. దీనిపై సిట్ అధికారులకు చార్మి ఫిర్యాదు చేశారు. అబిడ్స్ పీఎస్‌కుచెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించడంతోపాటు చేయి వేశారని సిట్ అధికారులకు చార్మి ఫిర్యాదు చేశారు.దీంతో అధికారులు సదరు కానిస్టేబుల్ ప్రవర్తనపై విచారణ జరుపుతున్నారు. అంతకు ముందు చార్మి … పైసావసూల్ సినిమా షూటింగ్ వద్దకు వెళ్లి పూరి జగన్నాథ్‌ను కలిశారు. అనంతరం సిట్ కార్యాలయానికి ఆమె వచ్చారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ చిత్రానికి చార్మి లైన్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు.  చార్మి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో మీడియా కూడా పెద్దెత్తున హడావుడి చేసింది.

Comments

comments