గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక విజయాలు, అద్వితీయ పురోగతి సాధించిన క్రీడాంశం బ్యాడ్మింటన్. పురుషల, స్త్రీల విభాగంలో కూడా బాగా ఆడి రాణించారు. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్.. మహిళల సింగిన్స్ లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఒకరిని మించి ఒకరు తమ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుని అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు. శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ ని గెలుచుకుని భారత్ తరుపున ఒకే ఏడాది అత్యధిక సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

అలాగే నలుగురు భారత్ ఆటగాళ్లు టాప్ 10 లో తనదైన ప్రదర్శనను సంపాదించి చరిత్రను సృష్టించారు. ప్రస్తుత బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం పీవీ సింధు, శ్రీకాంతులు మూడోవ స్థానంలో నిలవగా, సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ 10వ స్థానంలో నిలిచారు. అంతే కాకుండా టాప్ 20లో 16వ స్థానంలో సాయి ప్రణీత్ చోటు దక్కించుకున్నాడు. ఇది దేశ బ్యాడ్మింటన్ చరిత్రలోని మొదటిసారి.

Comments

comments