టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కు దుబాయ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదరుఅయింది. జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దానిలో భాగంగా తన కుటుంబంతో కలిసి దక్షిణాఫ్రికా కి బయలుదేరాడు. అయితే ధావన్ కుటుంబానికి ఎయిర్ లైన్స్ అధికారులు బోర్డింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దీనిని కారణంగా ధావన్ తన ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.

నాతో కలిసి దక్షిణాఫ్రికా వస్తున్న నా ఫ్యామిలీ ని అడ్డుకున్నారు. నా భార్య, పిల్లలకు దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే విమానానికి బోర్డింగ్ ఇవ్వలేదు. మా పిల్లల జనన ధ్రువీకరణ పాత్రలు కావాలని అని అడుగుతున్నారు. ఆ సమయంలో అవి మాకు అందుబాటులో లేవు. మమ్మలిని ముంబై లోనే అడగలిసింది. అప్పుడు మాకు ఈ సమస్య వచ్చేది కాదు. వారి ఇప్పుడు దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో నిరీక్షిస్తూన్నారు.

ఎలాంటి కారణం లేకుండా ఓ ఎమిరేట్స్‌ ఉద్యోగి తన కుటుంబ పట్ల దురుసుగా ప్రవర్తించాడని అసహనం వ్యక్తం చేశాడు. అయితే తన కాలికి గాయం అవ్వడంతో ఫిజియో నుంచి ఎటువంటి రిపోర్ట్ రాలేదు దీనితో ధావన్ తొలి మ్యాచ్ ఆడతాడో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి.

Comments

comments