అమరువీరులతో ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ తెలంగాణ ని బంగారు తెలంగాణ చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ని అయితే బంగారు తెలంగాణ చేయలేదు కాని వారి ఇంటిని మాత్రం బంగారంగా మార్చుకున్నారని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. మిడ్జిల్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణ సభ నిర్వహించారు. ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణాని బంగారు తెలంగాణ చేయడమేమో కాని ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని, లోక్ సభలో ఒక్క సీట్ ఉన్న తెరాస పార్టీ వలన తెలంగాణ రాలేదని కేవలం సోనియా గాంధీ దయ వల్లనే వచ్చిందని కాని తెలంగాణ తన వలన వచ్చిందని గొప్పలు చెప్పుకుంటాడు.

తెరాస ప్రభుత్వాని ఇక్కడ నుంచి పతనం కావాలని అక్కడ ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని కాని తన ప్రభుత్వం చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పుకుంటున్నారు. 90 శాతం పనులు కాంగ్రెస్ పరిపాలన లోనే జరిగాయి. కాని అని పనులు కూడా తన పరిపాలనలో జరిగాయి అం చెప్పుకోవడం హాస్యాస్పదం.

కేటీఆర్ కామెంట్ కు రేవంత్ రెడ్డి రీ- కౌంటర్:
ట్విటర్ లో రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ అభిమానులు అడగగా.. తను ఎవరో నాకు తెలియదని కేటీఆర్ చెప్పిన సమాధానం అందరికి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి దానికి నేను ఎవరో కేటీఆర్ కి తెలియదా? బుద్ది మందగించిన వారికీ తండ్రి ఈదృపడిన కూడా అంకుల్ లా అనిపిస్తారు. అప్పట్లో తెరాస కోసం పెట్టుబడి పెట్టిన నన్ను నేను ఎవరో తెలియకపోవడం తన మూర్కత్వం అని మండిపడ్డారు. తన స్థాయి ఏమిటో గుర్తుతెచ్చుకోమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళామంత్రులు లేకుండా అమెరికా అధ్యక్షుడు ఇవంకా సభకు కేటీఆర్ ఎలా వెళ్లాడని ప్రశ్నించాడు.

Comments

comments