కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన పంథం నెగ్గించుకున్నారు. అదును చూసి ఆయన కొట్టినదెబ్బకు కేఈ బ్రదర్స్‌తో పాటు ఏకంగా చంద్రబాబు దిగి వచ్చారు. తాను గతంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తే కేఈ బ్రదర్స్ అడ్డుకున్నారు.

చంద్రబాబు కూడా కేఈ బ్రదర్స్‌ మాటకే విలువ ఇచ్చారు. దీంతో మాటువేసిన బైరెడ్డి… ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అనుచరుడిని కేఈ ప్రభాకర్‌పై పోటీకి దింపారు. ఎన్నిక జరిగితే ఇండిపెండెంట్‌ అభ్యర్థికి వైసీపీతోపాటు కోట్ల వర్గం మద్దతు ఇచ్చే అవకాశం ఉండడంతో కేఈ ఆందోళన చెందారు. పైగా సోమిరెడ్డి చెప్పినట్టు 300 ఓట్ల మెజారిటీ రావాలంటే కనీసం వంద కోట్లు ఖర్చు పెట్టాల్సి వైసీపీ సభ్యులను కొనాల్సి ఉంటుందని నిర్దారణకు వచ్చారు. దీంతో చంద్రబాబు ఆశ్రయించారు టీడీపీ నేతలు. ఆయన నేరుగా బైరెడ్డిని బుజ్జగించారు.

తన వద్దకు పిలిపించుకుని పలు హామీ ఇచ్చారు. దీంతో బైరెడ్డి మొట్టు దిగారు. తన అనుచరుడి చేత నామినేషన్ ఉపసంహరింపచేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీలో చేరేందుకు చంద్రబాబుతోపాటు కేఈ బ్రదర్స్‌ కూడా అంగీకరించారు. ఒక మంచి రోజు చూసుకుని టీడీపీ చేరుతానని చంద్రబాబుతో భేటీ అనంతరం బైరెడ్డి చెప్పారు. మొత్తం మీద బైరెడ్డి కరెక్ట్ పాయింట్‌ చూసి కొట్టాడని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

Comments

comments