ట్రిపుల్ తలాక్ వ్యవహారం గురించి ఇప్పటివరకు అసలు పట్టించుకోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ట్విట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికీ జైలు శిక్ష పడాలని లోక్ సభలో ఆమోదం పొంది రాజ్యసభ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన చాందిని చౌక్ ఎమ్మెల్యే అల్క లంబ ఒక ట్విట్ చేశారు దీనితో ఈ ట్విట్ వివాదాస్పదంగా మారింది.

దుమారం లేపుతున్న ఓ ఎమ్మెల్యే ట్విట్:

అసలు ట్రిపుల్ తలాక్ గురించి చెప్పడం ఎందుకు? దాని గురించి జైలుకు వెళ్లడం ఎందుకు? అసలు భార్యను వదిలేసి వెళ్ళితే హాయిగా దేశానికీ ప్రధాని అయిపోవచ్చు కదా అని ట్విట్ చేశారు. దీనితో బీజేపీ నేతలు ఆమెపై మండిపడుతున్నారు. ఒక ప్రధాని మంత్రి పై ఈ విధంగా ట్విట్ చెయ్యడం తప్పు అని ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే మరికొందరు దీనిలో తప్పు ఏమి ఉన్నదని ఆమెపై చర్యలు తీసుకోవడం తప్పు అని ట్విట్ చేస్తున్నారు.

Comments

comments