రెండు రోజుల నుంచి రజనీకాంత్ అభిమానులతో భేటీ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తమ అభిమానులతో రజని ఏ మనిషికైనా కుటుంబమే ముఖ్యమంటూ చెప్పారు. ఈ తరుణంలోనే ఆ మధ్య నేను ధనుష్ తండ్రిని అని చెప్పి ఒక వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తన కొడుకును తమ వద్దకు పంపించాలని రజనీని అతను కోరుతున్నాడు. ధనుష్ ఎవరి కొడుకు అన్న విషయం రజనీకాంత్ కి కూడా తెలుసు కాని రజనీకాంత్ దానిపై స్పందించడంలేదు.

రజనీకాంత్ స్పందించకపోవడం దారుణం అని కదిరేషన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కదిరేషన్ మీడియాతో మాట్లాడుతూ.. నేను రజనీకాంత్ కు ఒక లేఖ పంపుతున్నాను.. తన భార్య మీనాక్షి ఆరోగ్యం అసలు బాగోలేదని, తన కుమారుడు తమతో ఉండటంలేదని దిగులు చెందుతుందని, తన కుమారుడు తనని పటించుకోవడంలేదనే బాధతోనే తను అనారోగ్యానికి గురి అయిందని తను ఆవేదనతో కుంగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు తమ కుమారుడు నుంచి ఒక రూపాయి కూడా అవసరం లేదని తమకు ఈ వయస్సులో తమకు అండగా ఉంటే చాలని, నేను మీ కుమారుడునే అనే ఒప్పుకుంటే చాలని విజ్ఞప్తి చేశాడు.

తల్లి దండ్రులను కాపాడలిసిన భాద్యత తమ కుమారుడిదే అని చెప్పిన రజని ధనుష్ కి కూడా చెప్పాలని హితువు పలికాడు. ధనుష్ తన కుమారుడేనంటూ మేలూరు కోర్టులో కదిరేశన్ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు సంబంధించి ధనుష్ స్టే తెచ్చుకుని, ఆ తర్వాత కేసు నుంచి పూర్తిగా బయటపడ్డాడు.

Comments

comments