నాలుగు రోజులనుంచి రజనీకాంత్ తమ అభిమానులతో భేటీ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. రజని తమ అభిమానుల భేటీ అనంతరం తమ రాజకీయ ప్రవేశం గురించి ప్రస్తావిస్తారని తమ అభిమానులు అంత వేచిచూస్తున్నారు. అయితే రజనీకాంత్ ఈ సారి ఆ ప్రస్తావన తీసుకుని వస్తారని అనుకోవడం లేదని సమాచారం. డిసెంబరు 31వ తేదీన రజనీకాంత్ తెల్చిచెప్పుతారని తమ అభిమానులు అనుకుంటున్న.. తమిళలో ఎన్నికలు వచ్చే వరకు రజనీకాంత్ దీని గురించి స్పష్టం ఇవ్వరు అని అభిప్రాయపడ్డుతున్నారు. అయితే రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి చర్చలు జరుగుతున్న సమయంలో రజనీకాంత్ భార్య లతకు మద్రాసు హైకోర్డ్ ఝలక్ ఇచ్చింది.

అసలు హైకోర్టు లతకు ఎందుకు ఝలక్ ఇచ్చింది?

మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ భవన సముదాయంలో ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. చాల సంవత్సరాల నుంచి దానిని చేస్తున్నారు లత. అయితే ఇటీవలే మున్సిపల్ కార్పొరేషన్ వారు అద్దె పెంచారు. ఒక్క సారిగా 3,702 రూపాయల నుంచి 21,160 రూపాయలకు పెంచారు. అయితే దీనిని గురించి లతా హైకోర్టు కు వెళ్లగా.. హైకోర్టు లతకు ఝలక్ ఇచ్చింది. మీరు అక్కడ నడపాలని అనుకుంటే అద్దె చెల్లించి నడిపించుకొండి లేదు అనుకుంటే అక్కడ నుంచి ఖాళీ చేయవచ్చు కదా దానికి కోర్టును ఎందుకు ఆశ్రయించారని మద్రాసు హైకోర్టు కఠినంగా చెప్పింది.

అద్దె చెలించకపోతే వేలం వేస్తాం…

ఒక్క వేల లతా అద్దె చెల్లించని యెడల ఆ షాపును వేలం వేసే హక్కు కార్పొరేషన్ కు ఉన్నదని తెలిపింది. అయితే వేలం వేసే వరకు మాత్రమే లతా ఆదీనంలో ఉంటుందని తరువాత ఖాళీ చేయాలిసిఉంటుందని జారీ చేసింది. అయితే లతా ఈ సంవత్సరం ఆగస్ట్ లో ఒక పాఠశాల గురించి కోర్ట్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ దాదాపు అద్దె చెల్లించకపోవడంతో అక్కడ నుంచి పాఠశాలను తరలించిన సంగతి అందరికి తెలిసిందే.

Comments

comments