మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ”సైరా నరసింహ రెడ్డి”. ఆంగ్లేయులను ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోదుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార ని దీనిలో ప్రధాన హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ చిత్రంలో సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ తప్పుకోవడం, సినిమాఫోటోగ్రఫీ మార్చడం జరిగాయి. దీనితో ఈ సినిమాపై రూమర్స్ మొదలు అయ్యాయి.

దర్శకుడిగా ఈ సినిమా కి వినాయక్ తీసుకుందామని అనుకుంటున్నారు అంట. కాని వినాయక్ కు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు అని తెలుస్తుంది. అలాగే నయనతార విషయంలో కూడా బాగానే రూమర్స్ వినిపిస్తున్నాయని సమాచారం. ఇప్పటివరకు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చేయటానికి రెడీగా ఉన్నది. మొదటి షెడ్యూల్ లో కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే చిత్రీకరించామని, సెకండ్ షెడ్యూల్ లో నయనతార సీన్స్ ఉంటాయని సైరా టీం చెప్పుతుంది. అంతే తప్ప నయనతార ఈ సినిమా నుంచి తప్పుకోవటం లేదు అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ విషయంలో చిరంజీవి గాని, లేక రామ్ చరణ్ గాని స్పష్టత ఇచ్చే వరకు ఈ సినిమాపై రూమర్స్ ఆగేలా లేవు.

Comments

comments