సీనియర్‌ తార విజయకుమారి తన నటనతో తన అందంతో ముందు తరం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఆమె తోటి నటీనటుల సంక్షేమం కోసం మరియు వారి అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఆమె సమర్పించిన ఈ నగదును దక్షిణ భారత నటీనటుల (నడిగర్‌) సంఘం నిర్మిస్తున్న భవనానికి ఉపయోగించాలని కోరారు.

ఇటీవలే ఈ నగదుకు సంభందించిన చెక్కును సంఘం కార్యదర్శి, నటుడు కార్తీకి కూడా అందజేశారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ విజయకుమారి గారికి తోటి నటీనటుల గురించి ఆలోచించే అంత పెద్ద మనసు ఉందని, ఆమె ఇచ్చిన ఈ స్ఫూర్తితో తాము త్వరలోనే ఈ భవన నిర్మాణాన్నీ పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని కార్తీ పేర్కొన్నారు.

Comments

comments