భారత మహిళల హాకీ జట్టు దక్షిణ కొరియా పర్యటనలో వరుసగా రెండో విజయంను సాధించారు. మంగళవారం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ అయిన కొరియాతో రెండో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ లో రాణి రాంపాల్‌ నేతృత్వంలో భారత్‌ 3–2తో విజయం సాధించింది. భారతదేశం తరుపున 6 వ నిమిషంలో పూనమ్‌ రాణి, 27వ నిమిషంలో రాణి రాంపాల్‌ మరియు 32వ నిమిషంలో గుర్జీత్‌ కౌర్‌ ఒక్కో గోల్‌ చేశారు.

కాగా, కొరియా జట్టుకు 10వ నిమిషంలో యురిమ్‌ లీ, 31వ నిమిషంలో జంగ్‌జియున్‌ సియోలు ఒక్కో గోల్‌ అందించారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2–0తో ఆధిక్యంలో ఉండగా.. గురువారం మూడో మ్యాచ్‌ జరగనుంది.

Comments

comments