2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ తో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన చంద్రబాబు.. 2019 ఎన్నికల సమయం వచ్చేసరికి రాజకీయ ప్రయోజనల కోసం అదే పార్టీపై విమర్శలు కురిపిస్తుండే సరికి అందరూ కూడా చంద్రబాబుకి నెగటివ్ గా మాట్లాడుతున్నారు. ఏపీ ప్రజలు బాబుపై పెట్టుకున్న నమ్మకానికి తోడు మోడీ ప్రభంజనం కూడా యాడ్ అయ్యేసరికి టీడీపీకి 2014 ఎన్నికల సమయంలో బాగా కలిసొచ్చింది.

మరోసారి ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు బీజేపీనే దోషిగా నిలబెడుతున్నారని చాలామంది అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చంద్రబాబు మరోసారి రుజువు చేశారు. అందితే కాళ్ళు.. అందకపోతే జుట్టు.. ఇది చంద్రబాబు సిద్ధాంతం. ముఖ్యంగా 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ను మరియు బీజేపీ ని వాడుకున్న ఆయన ఆ తరువాత రాజకీయ కారణాల దృష్ట్యా వారిద్దర్నీ దూరంగా పెడుతూ వచ్చారు.

ముఖ్యంగా నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఇవ్వాలని పవన్ కోరినా వాటిని చంద్రబాబు, పవన్ కు ఇప్పటివరకు పంపించలేదు. ఈ విషయాలపై పవన్ బహిరంగంగానే తన అసంతృప్తిని బయటపెట్టాడు. అంతేకాకుండా తనని వాడుకొని వదిలేశారనే ఘాటు విమర్శను కూడా చేశారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలను బీజేపీ విషయంలో కూడా రుజువు చేశాడు చంద్రబాబు.

బీజేపీతో పొత్తు వలన మనకు ఒరిగిందేమి లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయంగా ఎన్నో సందేహాల్ని, సందేశాల్ని తావిస్తుంది. ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన సహాయాన్ని కూడా కేంద్రం న్యాయంగా చెయ్యడం లేదని నాలుగేళ్ళ తరువాత తీరిగ్గా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు కొత్త పాటను అందుకున్నారు. నిజంగా టీడీపీ, బీజేపీ వలన ఏ మేలు జరగలేదా అంటే కచ్చితంగా జరగలేదనే చెప్పాలి.

2014 ఎన్నికల సమయంలో రాజకీయంగా కలిసొచ్చిన ప్రధాన అంశాలలో ఒకటి మోడీ ఇమేజ్. ఎన్నికల సమయంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం రాజకీయ ప్రయోజనాలు ఫస్ట్ అయితే రాష్ట్ర ప్రయోజనాలు రెండవ స్తానం అని కచ్చితంగా అందరూ అంటారు. ప్రత్యేక హోదా రాదనే విషయం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మూడేళ్ళ క్రితం నుండి బహిరంగంగానే చెబుతున్నారు.

ఆ సంగతి చంద్రబాబుకి తెలియంది కాదు. అందుకే ప్యాకేజి పాట పాడి ఏ రాష్ట్రానికి చెయ్యని సాయం కేంద్రం ఏపీకి చేసిందంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులు తారుమారు అవ్వడంతో ప్యాకేజి మాటను పక్కనబెట్టి హోదా కావాలని అంటున్నారు. ఇంకా ఎన్డీయే లో ఉంటామని చెప్పడం వెనుక ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. ఉపయోగం లేని బీజేపీతో ఎందుకు ఉంటున్నారో ?

పోలవరం, రాజధాని అయిన అమరావతి బిల్లులో ఉన్న అంశాలే. కేంద్రప్రభుత్వం వాటిని కచ్చితంగా అమలు చెయ్యాల్సిందే. అంటే చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను కూడా సాధించుకోలేమని చంద్రబాబు భయపడుతున్నట్లు ఉన్నారు. అయితే చంద్రబాబుది ఇది అంతా డబుల్ గేమ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి ఎన్నో సందేహాలు అందరిలో వినపడుతున్నాయి. మరి వీటన్నిటికీ బాబు దగ్గర సమాధానం ఉందో లేదో చూడాలి.

Comments

comments