చందమామ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన భామ సింధు మీనన్‌. ఇప్పుడు సింధు మీనన్‌ పై ఓ వార్త హల్ చల్ చేస్తుంది. సింధు మీనన్‌ బ్యాంకు అధికారులకు నకిలీ పత్రాలను సమర్పించి వారి వద్ద నుండి రుణం తీసుకొని తిరిగి ఆ రుణంను చెల్లించలేదని ఆమెపై మరియు ఆమె ముగ్గురు సోదరులపై బ్యాంకు అధికారులు బెంగళూరులోని ఆర్ఎంసి పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టారు.

పోలీసులు సింధు మీనన్‌ పై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చెయ్యడానికి ప్రయత్నించగా ఆమె విదేశాల్లో ఉందని తెలియడంతో ఆమె సోదరుడు అయిన కార్తికేయన్ ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. సింధు మీనన్ ఆర్‌ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌ నుంచి జ్యుబిలెంట్‌ మోటార్స్‌ వక్ఫ్‌ ప్రై.లి. సంస్థ పేరుతో 36 లక్షలు రుణంను తీసుకున్నారు. సింధు మీనన్ తిరిగి బ్యాంకు కు ఆ రుణంను చెల్లించకపోవడంతో సింధు మీనన్ ఋణం కోసం సమర్పించిన పత్రాలను బ్యాంకు అధికారులు పరిశీలించగా అవి నకిలీవని తేలడంతో తాము మోసపోయామని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

comments