2012 అండర్‌-19 వరల్డ్‌కప్‌ కు ఢిల్లీ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ నెగ్గిన సంగతి మనకి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ టోర్నీలో చంద్‌ ఫైనల్లో అజేయ శతకంతో కప్‌ సాధించడంలో ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి మనకి తెలిసిందే. ఈ టోర్నీలో చంద్‌ ఆడిన ఆట తీరును చూసి అతనికి సీనియర్‌ టీమ్‌లో తొందరగానే ఎంట్రీ దొరుకుతుందని అందరూ భావించారు. కానీ, చంద్‌ దేశవాళీల్లో పేలవ ప్రదర్శనతో ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీనితో ఢిల్లీ జట్టులో కూడా చైతూను సంపాదించుకోలేకపొయ్యాడు.

ఈ నేపథ్యంలో చంద్ మీడియాతో మాట్లాడుతూ.. ” ఢిల్లీ క్రికెట్‌ సంఘం చిల్లర, నీచ రాజకీయాలకు నేను బలిపశువునయ్యాను. ముంబైలో రెండేళ్ల క్రితం టీ20 జోనల్‌ మ్యాచ్‌ ఆడుతుండగా నన్ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నారని నాకు తెలిసింది. దానికి కొన్నినెలల ముందు నేను భారత్‌-ఎకు ప్రాతినిథ్యం వహించాను. అందులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాను. ఢిల్లీ తరఫున అంతకు ముందు సీజన్‌లో కూడా అత్యధిక స్కోరు చేసి బ్యాట్స్‌మన్‌గా నిలిచాను. అయినా కేసుల నాపై వేటు పడడంతో నేను షాక్ కు గురి అయ్యాను” అంటూ చందు పేర్కొన్నాడు.

Comments

comments