అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో బీటలు తప్పవా ? క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలను బట్టి చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏపీలోని కొన్ని నియిజకవర్గాలు టీడీపీకి ఇప్పటికీ కంచుకోటల్లా నిలిచాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో ఇప్పటికీ టీడీపీకి దాదాపుగా ఓటమి అన్నదే లేదు. అటువంటి నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటి.

పార్టీపరంగా అంతటి ఘన చరిత్ర కలిగిన నియోజకవర్గంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో అన్న గారి కొడుకు అన్న కారణంతో జనాలు బాలకృష్ణను ఆదరించారు. అటువంటిది తన వ్యవహార శైలితో బాలకృష్ణ పార్టీని కంపు చేసుకున్నారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి నియోజక వర్గం మొత్తాన్ని అప్పట్లో పీఏ గా ఉన్న చంద్రశేఖర్ కి అప్పగించేశారు.

దానితో పీఏ తన ఇష్టానుసారంగా వ్యవహరించడంతో సమస్యలు మొదలయ్యాయి. పార్టీలో ఏమైనా సమస్యలు చెప్పుకోవాలంటే బాలకృష్ణ అందుబాటులో ఉండడు. ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడాలి అని అన్నా ఏమైనా ఉంటే తన పీఏ తో చెప్పుకోమనేవారు. పీఏ ఏమో ఎవర్నీ దగ్గరికి రాణించేవాడు కాదు. అదేసమయంలో బాలకృష్ణ పేరు చెప్పి పీఏ భారీఎత్తునా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

అలాగే పార్టీ నేతలను ఏ మాత్రం లెక్కచేయడు. దీనితో నియోజకవర్గంలోని టీడీపీ నేతలందరూ పీఏ మీద కోపంతో బాలకృష్ణపై తిరుగుబాటు చేశారు. దీనితో పరిస్థితి అదుపుతప్పుతుందని గ్రహించిన చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో బాలకృష్ణ తన పీఏని తప్పించారు. శేఖర్ ప్లేస్ లో ఇప్పుడు పీఏగా ఉంటున్న అధికారి పని తీరు కూడా అలానే ఉండడంతో అక్కడి నేతల్లో బాలకృష్ణపై వ్యతిరేఖత పెరిగిపోతుంది.

అదే సందర్భంలో ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా వ్యతిరేఖత పెరిగిపోతుంది. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ కానీ పోటీ చేస్తే కనుక ఓటమి తప్పదనే ప్రచారం బాగా జరుగుతుంది. వైసీపీ నేత స్థానికుడైనా నవీన్ నిశ్చల్ పై జనాల మొగ్గు ఉందని.. అదే సమయంలో టీడీపీ స్థానిక నేత అంబికా లక్ష్మి నారాయణ కూడా రేస్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ పోటీ చెయ్యకపోతే తనకు టిక్కెట్ ఇవ్వమని చంద్రబాబుని అడుగుతున్నారు.

ఇటు నవీన్ నిశ్చల్ అటు అంబికాలు స్థానికులే అవ్వడంతో ఇద్దరికీ నియోజకవర్గంలో పట్టు ఉంది. అధికార పార్టీ నేత కాబట్టి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే అంబికా గెలుపు సాధ్యమని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. మరి బాలకృష్ణ ఏమంటారో చంద్రబాబు ఏమి చేస్తారో అనేదాని గురించి చూడాల్సిందే.

Comments

comments