దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ 2015 ఫ్రెంచ్‌ ఓపెన్‌ సందర్భంగా అస్వస్థతకు గురి అయ్యింది దీనితో ఆమె డ్రగ్స్ వాడాల్సి వచ్చింది. ఇలా అనారోగ్యానికి గురి అయినప్పుడు తాను డ్రగ్స్‌ ఉపయోగించడాన్ని విలియమ్స్‌ సమర్ధించుకుంది. సాధారణంగా క్రీడాకారులు వారి ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుడు వారికందించే చికిత్సలో డ్రగ్స్‌ వినియోగించాల్సి వస్తే దానికి వరల్ద్‌ యాం టీ డోపింగ్‌ ఏజెన్సీ అనుమతినిస్తుంది.

ఇలా అనుమతి ఇవ్వడాన్నే ” చికిత్సలో డ్రగ్స్‌ వాడేందుకు మినహాయింపు (ట్యూ) ” గా పేర్కొంటారు. దీని ప్రకారం అప్పట్లో తాను డ్రగ్స్‌ వినియోగించానని విలియమ్స్‌ చెప్పింది. ఆ సమయంలో డ్రగ్స్ వాడకపోతే ఆ టోర్నీలో పాల్గొనలేకపొయ్యేదానిని అని వివరించింది. కాగా, ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ తొలిరౌండ్‌లోనే జరీనా డయాస్‌ (కిర్గిస్థాన్‌)పై సెరెనా 7-5, 6-3 స్కోరుతో భారీ విజయాన్ని సాధించింది.

Comments

comments