కత్తి మహేష్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వరుస ట్విట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ కామినేని శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చెయ్యడంపై స్పందించి ఓ ట్విట్ చేశారు. “చంద్రబాబు గారికి అభినందనలు. కామినేని శ్రీనివాస్ గారి రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరకడం వలన పసికందులు మరణించిన వైభవ శకం ఇక ముగిసిందని భావిస్తున్నాను” అంటూ ట్విట్ చేశాడు.

శుక్రవారం కత్తి మహేష్ మరో ట్విట్ చేస్తూ… ” నా దృష్టిలో నిజమైన హీరోలు కేవలం నాలుగురంటే నలుగురే. వారెవరంటే సంపూర్ణేష్ బాబు, నిఖిల్ మరియు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై స్పందించిన పవన్ కళ్యాణ్, శివాజీ లు ఇక మిగతా ఏ హీరో కూడా ఆంధ్రప్రదేశ్ కోసం మరియు ప్రజల కోసం కనీసం ఓ ట్విట్ కానీ, ఒక ఉద్యమ అడుగు కానీ అంతెందుకు ఒక మాట కూడా మాట్లాడడం లేదు. కాబట్టి నా దృష్టిలో కేవలం ఆ నలుగురే హీరోలు” అంటూ పేర్కొన్నారు.

Comments

comments