రాజకీయాల్లో ముక్కుసూటి తనంగా మాట్లాడకలిగే తత్వం ఉన్న నేతగా పేరుపొందిన నేత జయప్రకాశ్ నారాయణ ఇపుడు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతుందని అన్నారు. అయితే 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసి చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన సంగతి మనకి తెల్సిందే.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన అన్న దారిలోనే వెళ్ళబోతున్నారంటూ జేసీ తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశారని జేసీ పేర్కొన్నారు. కాగా, ఇటీవల జేపీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… రాజకీయ అధికారం ఎవరి సొత్తు కాదని.. ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికి ఉందని.. అధికారంలో ఉన్న వ్యక్తులెవరైనా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని అన్నారు.

వచ్చే ఎన్నికల తరువాత జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్నారని రాజకీయంగా చర్చ కూడా ఉంది. ఇందుకు మీకు సమాధానం ఏమని అడగగా.. దీనికి స్పందించిన జేపీ ఆలూ లేదు సోలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట ఒకడు అంటూ జనసేనపై హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు జేపీ. జనసేన ఇంకా ఎన్నికల్లో పోటీనే చెయ్యలేదు. రాజ్యసభ సీటు కావాలంటే సంఖ్యాబలం కావాలి. ఎన్నికల్లో జనసేన నుంచి ఎవరొకరు పోటీ చేస్తే వారు నెగ్గినట్టు.. నెగ్గిన తరువాత వారు నన్ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకున్నట్టు.. అందుకు నేను ఒప్పుకున్నట్టు… ఎంత దూరం ఆలోచిస్తున్నాం మనం.

వచ్చే ఎన్నికల్లో అసలు జనసేన పోటీ చేస్తుందో లేదో? అని స్పష్టత రావాలి కదా అని అన్నారు జేపీ. నన్ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకుంటారా ? హాస్యాస్పదంగా ఉంది.. నాకు నవ్వొస్తుంది అంటూ జేపీ ఇంటర్వ్యూను ముగించేశారు.

Comments

comments