హైదరాబాద్‌ ప్లేయర్‌ కోన తరుణ్‌ జమైకా ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో డబుల్స్‌ టైటిల్‌ ను సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీ జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో గారెత్‌ హెన్రీ–రికెట్స్‌ (జమైకా) పై 21–17, 21–17 తో రుణ్‌–సౌరభ్‌ శర్మ (భారత్‌) జంట విజయం సాధించింది. ఈ జోడి సెమీస్‌లో టాప్‌ సీడ్‌ జోస్‌ గ్యురెవా–డానిల్లె టొర్రె (పెరూ) జంటపై 21–5, 21–8తో విజయం సాధించింది.

Comments

comments