ఇరిగేషన్ కాంట్రాక్టులపై కేంద్రం నిఘా… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ముడుపులే రాబొయ్యే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వచ్చిన సొమ్మునే 2019 ఎన్నికల్లో మంచి నీళ్లలా ఖర్చు చేయబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంభందించి బ్లాక్ మనీ పెద్ద ఎత్తున పోగుచేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలన్నీ ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఇచ్చే ఫండ్ మీదే ఆధారపడి ఉన్నాయి.

కాంట్రాక్టు ఇచ్చినందుకు, కాంట్రాక్టర్లను అడ్డుకోకుండా ఉన్నందుకు ఎవరి వాటాలు వారికీ అందబోతున్నాయి. అందుకే ఇప్పుడు కేంద్ర నిఘా సంస్థలు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఉన్న కంపెనీలపై నిద్ర పెట్టాయి. ఏ ఏ సంస్థకు ఏ ఏ కాంట్రాక్టులొచ్చాయి? ఏ ఏ పార్టీలకు పరోక్షంగా నిధులు పోతున్నాయి? ఎంత % లో ఇరిగేషన్ కాంట్రాక్టర్లు కమిషన్ ఇస్తున్నారు? ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయి? మొదలైన అంశాలపై కేంద్ర నిఘా సంస్థలు ద్రుష్టి సారించాయి.

రెండు రాష్ట్రాల్లోని పెద్ద నాయకులను కంట్రోల్ చెయ్యాలంటే వాళ్ళ ముడుపులు, కమిషన్ల భాగోతాన్ని టార్గెట్ చెయ్యడమే ప్రధానమని, రెండు రాష్ట్రాల పార్టీలకు నిధులు వస్తున్న దారిని అడ్డుకుంటే తప్ప వీరిని కంట్రోల్ చేయలేమని బీజేపీ భావిస్తుంది.

Comments

comments