ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ నవజోత్‌కౌర్‌ స్వర్ణ పతకంను గెలిచి చరిత్ర సృష్టించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన సంగతి మనకి తెలిసిందే. నవజోత్‌ మహిళల 65 కిలోల విభాగంలో కెరీర్‌లోనే ఎంతో అద్భుతంగా రెండో ర్యాంకుకు చేరుకుంది. కాగా మొదటి ర్యాంక్‌ లో ఫిన్లాండ్‌కు చెందిన పెట్రా ఒల్లి నిలిచింది. భారత్‌కు చెందిన వినేష్‌ ఫోగట్‌ 50 కిలోల విభాగంలో 22 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచారు.

కాగా, ఇందులో మొదటి ర్యాంక్ ను 24 పాయింట్లతో చైనా రెజ్లర్‌ లీచున్‌ దక్కించుకుంది. సంగీత ఫోగట్‌ 59 కిలోల విభాగంలో 5వ ర్యాంకు, 18 పాయింట్లతో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ 62 కిలోల విభాగంలో 4వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక పురుషుల ఫ్రీస్టయిల్‌ కేటగిరి విషయానికొస్తే శ్రావణ్‌ 61 కిలోల విభాగంలో 8వ ర్యాంక్ మరియు భజరంగ్‌ పూనియా 65 కిలోల విభాగంలో 4వ ర్యాంకులో నిలిచారు.

Comments

comments