ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించి తెలియని వాళ్ళే ఉండరు. “బాహుబలి” సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారనే వార్త జనాల్లో ఎంతగానో పాతుకుపోయింది. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి ఫోటో ఎప్పుడైతే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిందో అప్పటినుండి ఈ వార్తపైనే అందరి ద్రుష్టి పడింది.

అంతేకాకుండా ఈ వార్తకు మరింత బలాన్నిచ్చేలాగా రోజుకొక వార్త రావడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, రాజమౌళి తీయనున్న ఈ సినిమాలో న్ట్, రామ్ చరణ్ లు అన్నదమ్ములుగా నటించనున్నారనే వార్త ఇప్పుడు షికారు చేస్తుంది. అంతేకాకుండా రాజమౌళి ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసేలా కథను కూడా రెడీ చేసారని, ఇందులో అన్నగా ఎన్టీఆర్ నటిస్తే తమ్ముడిగా రామ్ చరణ్ నటిస్తున్నారని సమాచారం.

Comments

comments