తెలుగుజాతి ఖ్యాతిని దేశమంతా తెలిసేలా చేసిన నంద‌మూరి తార‌క రామారావు గారి జీవిత కథ ఆధారంగా ఆయన కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఓ సినిమాను తెరకెక్కించబోతున్న ట్లు ప్రకటించిన సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు తేజ రూపొందించనున్నాడు. బాలకృష్ణ ఈ సినిమాలో నటించడమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా కూడా మారుతున్నారు.

కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ కు భార్యగా ఎవర్ని ఎంపిక చేసుకోవాలో అని ఆలోచనలో పడిన చిత్ర బృందం చివరికి ఎన్టీఆర్ కు భార్యగా విద్యాబాలన్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ యంగ్ గా ఉన్నప్పుడీ పాత్రను పోషించడానికి శర్వానంద్ ను చిత్రబృందం కోరినట్లు తెలుస్తుంది. కాగా, ఈ రెండు పాత్రల విషయంలో అధికారిక ప్రకటన అనేది వెలువడాల్సి ఉంది. ఈ సినిమా యొక్క షూటింగ్ కూడా అతి త్వరలోనే ప్రారంభం అవ్వనుంది. 2019 జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉంది ఈ చిత్ర బృందం.

Comments

comments