“పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఆయన ప్రతి మాట లోను తెలుగు తెలుగు అని అంటుంటారు. అంటే ఆయన చదివే పుస్తకాలు కానీ,ఆయన మాట్లాడే తీరు కానీ, ప్రతిభాషలోను ఆయన తెలుగు భాషపైన ఆయనకున్న మక్కువను తెలుపుతూ ఉంటారు. ఈరోజు నేను ఆయనికి ప్రశ్నిస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుగును ఎంతగానో ఇష్టపడతారు. మీరు తెలుగుని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు.. యూత్ ని ఎంతగానో ఇన్ స్పైర్ చేస్తున్నారు. మరి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ ని ఎందుకు తీసుకోరు ?

పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుగు గురించి అన్ని లెక్చర్స్ ఇస్తుంటారు కదా. అందరికి సహాయం చేస్తానని చెబుతారు కదా. మరి మీకు తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వాలని అనిపించడం లేదా ? నిజంగా పవన్ కళ్యాణ్ మీకు కానీ మనసుంటే కనుక మీరు తెలుగు అమ్మాయిలకి ఆఫర్లు ఇచ్చి విలన్లను తెలుగు వారిని పెట్టుకొని, టెక్నీషన్స్ ని కూడా తెలుగువారిని పెట్టి అప్పుడు మాట్లాడండి సార్.. నాకు భయం లేదండి. నన్ను కొట్టేస్తారా మీ అభిమానులు. మీ అభిమానుల వలన ఒకప్పుడు కట్టి మహేష్ కూడా ఇబ్బంది పడ్డారు. మీరు ఒకవేళ ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా పెట్టండి.

కనీసం మీ సినిమాలో రెండవ హీరోయిన్ గా కూడా తెలుగు అమ్మాయికి ఎందుకు ఛాన్స్ ఇవ్వరు. చివరికి విలన్స్ ని కూడా ఎక్కడి వాళ్ళనో తీసుకుంటున్నారు కానీ మన తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవడం లేదు. అంతెందుకు సపోర్టింగ్ యాక్టర్స్ ని కూడా మీరు తెలుగు వాళ్ళని తీసుకోవడం లేదు. మీరు పైకి వచ్చింది తెలుగు ఇండస్ట్రీ మీద. మీరు ఈ స్థాయిలో ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజల వలన. మీరు ఈరోజు పవనిజం అనే స్థాయికి వచ్చారంటే అది తెలుగు రాష్ట్రాల ప్రజల సపోర్ట్ తో.

ప్రస్తుతం మీరు మంచి పోసిషన్ లో ఉన్నారు. మీరు కనుక తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీ నేర్చుకుంటుంది. ఎందుకంటె ఇండస్ట్రీలో మిమ్మల్ని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు.
మీకు చాలా మార్కెటింగ్ ఉంది కాబట్టి మీరు కానీ తెలుగు వారికీ ఛాన్స్ ఇస్తే వారికీ కొంచెం ఫుడ్ దొరుకుతుంది. పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ అని చెప్పి మీ పిచ్చి ఫాన్స్ మీకు ఇంత చేస్తున్నారు కదా.. నేను కూడా మీ యాక్టింగ్ అంటే ఇష్టపడతాను. కానీ మిమ్మల్ని నేను పర్సనల్ గా ఏమి అనడం లేదు. మిమ్మల్ని నేను ఒకటే రిక్వస్ట్ చేస్తున్నాను నా వైపు నుండి మీరు తెలుగు అమ్మాయిలకి ఆఫర్ ఇవ్వండి.

మీరు కొంచెం దారి చూపితే మేము కూడా ఎదుగుతాం సార్. మీరు ప్రణీత లాంటోళ్ళకో లేకపోతె ఎక్స్, వై, జెడ్ వాళ్ళందరి పేర్లు చెప్పడం ఎందుకు కానీ మీరు మాత్రం తెలుగు వారిని ఎంకరేజ్ చెయ్యండి. ఆల్రెడీ ఒకో హీరోయిన్ చేతిలో 100 సినిమాలు ఉంటాయండి అయిన కూడా వీరు ఆ హీరోయిన్ ని పిలుస్తారు, పబ్లిసిటీకి కూడా ఆ హీరోయిన్ నే పిలుస్తారు. హిట్ అయిపోయిన హీరోలకి పక్కన హీరోయిన్ ఎవరనేది ముఖ్యమా ? సమంతనే కావాలా ? అందరికి ఇలియానా, తమన్నాలే కావాలా? ఏ మిగతావారు మనుషులు కాదా ? మిగతా వారు మనుషుల్లా కనపడడం లేదా ? ఏ వారు మాత్రం మైంటైన్ చెయ్యట్లే ? ” అంటూ శ్రీరెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో మండిపడింది.

Comments

comments