నిదహాస్‌ ట్రోఫిలో భాగంగా టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా ఓ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో సురేశ్‌ రైనా ఓ సిక్స్ కొట్టి అంతర్జాతీయ టీ20ల్లో రైనా 50 సిక్సులను పూర్తి చేసుకున్నాడు. రైనా ఇప్పటికే టీ20ల్లో మరిన్ని సిక్సులను పూర్తి చేసుకున్న ఘనతలో మూడో భారత ఆటగాడిగా కొనసాగుతున్నారు. ఇక తాజాగా కొట్టిన సిక్సుతో రైనా ఈ అరుదైన 50 సిక్సుల ఘనతను తన సొంతం చేసుకున్నారు.

రైనా 27 బంతుల్లో మొత్తం 28 పరుగులు చేశారు. వీటిలో ఒక ఫోరు, ఒక సిక్సుని కొట్టాడు. భారత ఆటగాళ్లలో యువరాజ్‌ 74 సిక్సులతో తొలిస్థానంలో ఉండగా, 69 సిక్సులతో రోహిత్‌ శర్మ రెండో స్థానంలో నిలిచారు. ఇక దేశం మొత్తంలో క్రిస్‌ గేల్‌, మార్టిన్‌ గప్టిల్‌లు 103 సిక్సులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. కాగా, ఈ మ్యాచ్ లో బంగ్లాతో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి మనకి తెలిసిందే.

Comments

comments